వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్‌ప్లాన్లను లాంచ్ చేసింది. రూ. 218, రూ. 248 ల ప్లాన్లను భారతదేశంలో ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌లు 28 రోజుల చెల్లుబాటులో ఈ ప్లాన్‌పై అపరిమిత కాల్స్ తోపాటు 8జీబీ దాకా డేటాను అందిస్తుంది. దీంతోపాటు వొడాఫోన్ డబుల్ డేటా ఆఫర్‌తో రూ. 299, రూ. 399, రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్లనుకూడా తీసుకొచ్చింది. కంపెనీ వెబ్‌సైట్‌లో లేదా మై వోడాఫోన్ యాప్ ద్వారా రీఛార్జ్‌కు అందుబాటులో ఉన్నాయి.
కొత్త వోడాఫోన్ రూ. 218 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఇందులో అపరిమిత కాల్స్ (ఏదైనా నెట్‌వర్క్‌కు స్థానిక, జాతీయ), 6జీబీ డేటా, 100 స్థానిక, జాతీయ ఎస్‌ఎంస్ లు ఉచితం. దీనితోపాటు వొడాఫోన్ ప్లే (రూ. 499 ధర) జీ 5 (రూ. 999) కాంప్లిమెంటరీ చందా లభిస్తుంది.