న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశం తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 13 దేశాల నుంచి 64 విమానాల ద్వారా భారతీయులను తరలించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా మే 7వ తేది నుంచి 13 వరకు విమాన సర్వీసులను నడపనుంది. బ్రిటన్ నుంచి 7, అమెరికా నుంచి 7 విమానాల ద్వారా భారతీయలను స్వదేశానికి తరలించనుంది. 64 విమానాల ద్వారా దాదాపు 15 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకురానుంది. అలాగే దీనికి సంబంధించిన ప్రయాణ ఖర్చుల వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. (కోవిడ్-19 కట్టడి : కేంద్రం కీలక నిర్ణయం)
విదేశాల నుంచి భారతీయులు : టికెట్లు ధరలు ఇవే